ప్ర జాఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్
కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
విద్యార్థుల్లో నెలకొన్న సామాజిక స్పృహను పెంపొందిం చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతా యని ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ అ న్నారు.బుధవారం సత్యం టెక్నో స్కూల్ లో సైన్స్ ఫెయిర్ 2024 (వైజ్ఞానిక ప్రదర్శన)ను విద్య వెంకట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో పలు వైజ్ఞానిక ప్రదర్శనలు సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యం తోపాటు తిలకించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక స్పృహను పెంపొందించాలంటే సృజ నా త్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞా నిక ప్రదర్శనలు ఎంతగానో దోహద పడతాయన్నాని అన్నారు.విద్యా రంగంలో పోటీ కారణంగా కేవలం బట్టి చదువులకే పరిమితం కాకుం డా సృజనాత్మకతను పెంపొందించే విధంగా పాఠాలు బోధిస్తే వారు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ద గల
శక్తి అధ్యాపక వర్గానికి ఉంటుంద న్నారు.చిరుప్రాయంలోనే పిల్లలు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివే
బోధనా రంగ వ్యవస్థ ఏర్పడాలన్నా రు.తద్వారా పిల్లల చదువు సంస్కా రం, సభ్యతతో ముందుకు సాగితే భావితరాలకు ఆదర్శ పౌరులు కాగలరని అన్నారు.సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యం మాట్లా డుతూ తమ పాఠశాలలో విద్యార్థు లకు ఆదర్శనీయమైన బోధనతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా క్రమశిక్షణ గల నైపుణ్యత అధ్యాపక వర్గంతో బోధ నలు చేస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాలల్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించడానికి విద్యా ర్థుల తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా పనితీరును అవగాహన కల్పిస్తున్న ట్లు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు ప్రతి యేదాడి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అరవింద టెక్నో
స్కూల్స్ డైరెక్టర్ అరవింద్ బాబు, మీ ప్రి న్సిపాల్ వెంకటేశం,కరస్పాం డెంట్ సౌజన్య తదితరులు పాల్గొ న్నారు.