నర్సంపేట,నేటిధాత్రి :
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్లో సైన్స్ డే ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను
శ్రీ ఆదర్శ వాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి ఉపాధ్యాయులతో కలిసి తిలకించారు. విద్యార్థుల మేధాశక్తి ఆలోచన విధానాన్ని సైన్స్ డే పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇందులో భాగంగా విద్యార్థులు సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని మరెన్నో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని విద్యార్థులకు ఉద్బోధ చేశారు.అలాగే విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసిన ఉపాధ్యాయులను శాలువలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చన్న, ప్రిన్సిపాల్ సుధాకర్, రవి, సైన్స్ ఉపాధ్యాయులు సాంబయ్య, స్వప్న, చారి, రమ్య, ప్రియలత,వీణ,వెన్నెల, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.