School Teachers Honor New Gram Panchayat Team
గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించే కార్యక్రమం స్థానిక పాఠశాలలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, ఉపసర్పంచ్ శ్రీమతి బోట్ల శ్యామల తో పాటు వార్డు సభ్యులు కుమారస్వామి, శ్రీనివాస్,అరవింద్,లావణ్య, వెంకటేశ్వర్లు,మంజుల,రమ లను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ
గ్రామ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి,పాఠశాల అభివృద్ధిలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణం,మౌలిక వసతుల మెరుగుదల వంటి కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పావని, సత్యపాల్,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని,విద్యార్థుల సంఖ్య పెంపు,ప్రహరీ గోడ నిర్మాణం,పరిశుభ్రత,మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, ముస్త్యాలపల్లి పాఠశాలను ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు,పాఠశాల విద్యార్థి నుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.
