అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్కూల్ డే వేడుకలు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఘనంగా స్కూల్ డే వేడుకలు, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ ఆఫీసర్ సింఫోనియా, అంగన్వాడి సూపర్వైజర్ సద్గుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని టీచర్లను ఆదేశించారు.