SFI Demands Immediate Scholarship Fee Reimbursement
స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
ఈనెల 30న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ్ కుమ్మరి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో 300 విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ్ కుమ్మరి రాజు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అని వారు అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధుల విద్యా రంగానికి కేటాయిస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసింది అని వారు అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అదేవిధంగా ఈనెల 30వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్తంగా బందును సంబంధించి డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రొఫెషనల్ కళాశాలలో డిప్లమో కళాశాల యూనివర్సిటీలు బంధుని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సకినాల వికాస్ జిల్లా కమిటీ సభ్యుడు వంశీ తదితరులు పాల్గొన్నారు
