“Kannuri Maheshwari Elected as SC Welfare Association Women President”
ఎస్సీ సంక్షేమ సంఘం మహిళా కార్పొరేషన్ ఎన్నిక
జిల్లా అధ్యక్షురాలుగా కన్నూరి మహేశ్వరి నియామకం
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఎస్సీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం మహిళా విభాగం మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షురాలుగా కన్నూరి మహేశ్వరి ని ఏకగ్రీవంగా ఎన్నుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ మంగళవారం నియామక పత్రాన్ని అందించారు.మహిళ నాయకుల ముఖ్య సమావేశాన్ని శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్న కుల గృహంకార దారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలని దాడులు చేస్తున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ మతోన్మాద బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా మతకల్లాలతో మరణ హోమం సృష్టిస్తుందని ఇందులో సామాన్య ప్రజలను బలి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి నీచపు ఆలోచనలు మానుకోవాలి అని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాజ్యాంగాన్ని మార్చలేరని మార్చే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అంబేద్కర్ వాదులుగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సంఘ నిర్మాణం కోసం దిశ నిర్దేశం చేసి సంఘ బలోపేతం చేయాలని మహనీయులను ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,సావిత్రిబాయి ఫూలే లను ఆదర్శంగా తీసుకొని సంఘం బలోపేతానికి నిరంతర కృషి చేయాలని తెలిపారు.అలాగే శ్రీరాంపూర్ ఏరియా మహిళా విభాగం అధ్యక్షురాలుగా మాలం నీలమ్మ, ప్రధాన కార్యదర్శి రౌతు లక్ష్మి, శ్రీరాంపూర్ వాటర్ ట్యాంక్ ఏరియా అధ్యక్షురాలుగా నిమ్మ లక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా బేతు విజయలక్ష్మిని ఎన్నుకోవడంజరిగింది.ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులు జక్క మొగిలి,నస్పూర్ జోన్ ప్రధాన కార్యదర్శి విజయ్,అరుణక్కనగర్ ప్రధాన కార్యదర్శి శంకర్,మంచిర్యాల కార్పొరేషన్ నాయకులు ఓదెలు,కొమురయ్య,వెంకన్న, రాయమల్లు,మహిళా నాయకురాలు మహేశ్వరి,లక్ష్మి,నీలమ్మ, లక్ష్మీ,సువర్ణ, జ్యోతి,విజయలక్ష్మి,సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
