కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:-
ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ
కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
తెలిపారు.
శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా నవదుర్గ అమ్మవారి దర్శనానికి విచ్చేశారు.
ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పాలకమండలి సభ్యులు
అర్చకులు వేదమంత్రాలతో ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనదుర్గ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని జిల్లా పాలన
యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భక్తుల నుండి మంచి స్పందన లభిస్తుందని
చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏడి మైన్స్ జయరాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.