బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి
____________________
కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:

యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ దళితుడైన శాసనసభాపతిని అగౌరవపరుస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ను గౌరపరచడం సిగ్గు చేటాని అన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదని అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఐ ఎన్ టి యు సి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ , నియోజకవర్గ మహీళ అధ్యక్షురాలు అస్మా నాయకులు ఖాజా మీయ , గౌస్ భాయ్ , ఇనాయత్ , జయరాజ్ , విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
