
worker
ఆశా వర్కర్ పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ అయినా ఆశా వర్కర్ పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితునిపైఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఆశా వర్కర్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగాఒక కామాంధుడు దౌర్జన్యం చేసి,బెదిరించిఅత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన జరిగి వారం రోజులు కావస్తున్ననిందితుని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదని తక్షణమే నిందితునిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కఠినంగా వ్వవ రించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్వవహరించి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళల రక్షణ కోసంతగిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని, పోలీస్ యంత్రాంగం నిందితుడికి అండగా ఉండి బాధితురాలికి అన్యాయం చేసి వైఖరి అవలంబిస్తున్నట్టు కనబడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొనినిర్లక్ష్యంగా వ్వవహ రించిన పోలీస్ అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బాధితురాలికిసరైన వైద్యం అందించాలని,ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని,ప్రభుత్వ ఉద్యోగం, మరి ఇతర ఆర్థిక సహాయసహకారాలుఅందించాలనివారు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, అంతిరెడ్డి,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి,సిపిఎం నాయకులు ఎస్ కే. జహంగీర్, యాదయ్య, నరసింహ,వెంకన్న,లక్ష్మమ్మ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.