
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు ఉపేందర్ మాదిగ
హన్మకొండ, నేటిధాత్రి:
ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు.శనివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు.తొమ్మిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి ఉందని నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మాదిగల ఓట్ల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహసభ ద్వారా ఎస్సీ వర్గీకరణ పేరుతో కమిటీ ఏర్పాటు చేస్తామని,రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి ప్రభుత్వం మాదిగ లను మళ్ళీ మోసం చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారని అన్నారు.కేంద్రం బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పార్లమెంటులో సంఖ్యాబలం ఉన్న బిజెపి ప్రభుత్వం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు.లేనియెడల రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మాదిగల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.