పాలకుర్తి నేటిధాత్రి
పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రభుత్వంను మాదిగ జర్నలిస్ట్ ఫోరం పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఎడవెల్లి సోము మాదిగ
డిమాండ్ చేశారు.పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సోము మాదిగ మాట్లాడుతూ బీజేపీ ప్రభత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జాతీయ స్థాయిలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. 70 ఏళ్ళలో మాదిగలకు రాణీ ఉద్యోగాలు చంద్రబాబు ఉమ్మడి రాష్రంలో చేసిన వర్గీకరణతో ఒక్క ఎడాదే 20 వేల ఉద్యోగాలు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు వచ్చాయి. జాతీయ స్థాయిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను రద్దు చేయడంతో మాదిగలకు, మాదిగ ఉప కులాలకు అన్నిరంగాలలో అన్యాయం జరగుతుందని ఆవేధన వ్వక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తామని చెప్పుకుంటున్న ప్రధాని మోది వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని అన్నారు. లేనిచో మాదిగల, మాదిగల ఉపకులాల ఉగ్రరూపంను బీజేపీ రుచిసూస్తాదని హెచ్చరించారు.