Savitribai Phule Jayanti Celebrations in Medchal
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
* మహిళ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 3 :
ఆధునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విద్యకు ఆద్యురాలైన మహనీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమీడి జైపాల్ రెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహా రెడ్డిలు ఉపాధ్యాయులతో కలసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అపూర్వమని, ఆమె స్థాపించిన మొదటి మహిళా పాఠశాల దేశంలో మహిళా విద్యకు బాటలు వేసిందని అన్నారు. సమాజాభివృద్ధికి మహిళా విద్య అత్యంత కీలకమని, ప్రతి బాలిక విద్య పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గత సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఉపాధ్యాయులు యమ్ శశిరేఖ, బి హేమలత, ఎల్ మంజులత, పి నిర్మల, పివియస్ నాగలక్ష్మి, వి జ్యోతి, వైష్ణవి, లలిత, శివలక్ష్మి, రాఖీ, మమత గార్లను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ చంద్ర, ప్రశాంత్ నాయక్, రవీందర్ చారి గార్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
