Savitribai Phule Jayanti Celebrated at Chandurthi School
ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.
చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహానీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని PM SHRI MPPS చందుర్తి పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయినిలైన
వేముల సుజాత, జ్యోతి, స్వప్న, హేమలత ను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని వేముల సుజాత మాట్లాడుతూ,
“సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలు. ఆమె చేసిన పోరాటాలు, సేవలు నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. బాలికల విద్యను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది”
అని పేర్కొన్నారు.
ఆమె మహిళా సాధికారత, సమానత్వం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యతను వివరించారు. సావిత్రిబాయి పూలే జీవితం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రసాద్, గుఱ్ఱం బాలకిషన్, కొత్తూరి శ్రీధర్, రాకం రవి, మరియు కాపిల్ల నరేష్ లు పాల్గొని, సన్మానం పొందిన ఉపాధ్యాయినిలను అభినందించారు. అలాగే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా ముగిసింది.
