
China Open badminton tournament.
సాత్విక్ జోడీ పరాజయం
సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి జోడీకి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్ టాప్ జంట సెమీఫైనల్లో…
చాంగ్జౌ: సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి జోడీకి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్ టాప్ జంట సెమీఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ ద్వయం 13-21, 17-21తో రెండోసీడ్ జంట ఆరోన్ చియా/సో వూయి యిక్ (మలేసియా) చేతిలో చిత్తయింది. ఈ జోడీ ఓటమితో టోర్నీలో భారత్ కథ పూర్తిగా ముగిసింది.