Satish Yadav
సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…
తిరుపతి, నేటిధాత్రి:
చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సిడిసిఏ) కార్యదర్శి సతీష్ యాదవ్ ను తిరుపతి యాదవ నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీమాన్ సన్నిధి శరభయ్య యాదవ్ విగ్రహ స్థాపన సమావేశంకు సతీష్ యాదవ్ ను గౌరవంగా ఆహ్వానించారుఈ సందర్భంగా తిరుపతి యాదవ నాయకులు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, పలువురు యాదవ నాయకులతో కలిసి సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
