రంజాన్ తోఫా పంపిణీ చేసిన సతీష్
సిపిఐ 25వ వార్డు ఇంచార్జ్ క్యాతరాజు సతీష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రంజాన్ పర్వదినసందర్భంగా కారల్ మార్క్స్ కాలనీలో 25వ వార్డులో ముస్లిం సోదరులకు సిపిఐ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా (పండుగ సామాను) అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముస్లింల అత్యంత ప్రసిద్ధమైన పండుగ రంజాన్ అని ఈ రంజాన్ సందర్భంగా నెల అంతా ఉపవాసాలు ఉండి పవిత్రంగా దేవుని ఆరాధించే గొప్పనైన పండుగని కొనియాడారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ రోజున హిందువులందరిని పిలిచి పండుగ చేసుకుంటారని హిందువులు ముస్లింలు ఐక్యమత్యంగా కలిసి ఉండడానికి ఈ పండుగ ఒక ప్రతిక అని అన్నారు కార్మాస్ కాలనీలో 25 వ వార్డ్ లో దాదాపు 20 కుటుంబాలకు 450 విలువైన సామాగ్రిని అందివ్వడం జరిగిందన్నారు కాలనీలో ఉండే ముస్లింలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంటుందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ 25వ వార్డు సహాయ కార్యదర్శి యాకుబ్ పాషా, సాబీర్ భాష, కసరబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు