రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య గౌడ్ కు సన్మానం
వీణవంక (కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో సోమవారం గౌడ సొసైటీ సభ్యులందరూ కలిసి ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు మ్యాడగొని సదయ్య గౌడ్ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగోని బుచ్చయ్య గౌడ్ ని శాలువా కప్పి గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు . వారు మాట్లాడుతూ.. సంఘానికి కులస్తులకు అభ్యున్నతకై పనిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కత్తి కొమురయ్య వడ్లకొండ మల్లయ్య శ్రీను స్వామి గ్రామ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.