మాజీ ఎమ్మెల్యే..
సమక్షంలో పార్టీలో చేరికలు..
నిజాంపేట: నేటి ధాత్రి
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పలువురు సర్పంచులు పార్టీలో చేరారు. చల్మెడ కామన్ నుండి బైక్ ర్యాలీగా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలతో బైక్ ర్యాలీగా హాజరయ్యారు.

అనంతరం నందగోకుల్ పాతూరి భాను ప్రసాద్ రెడ్డి, తిప్పనగుల్ల సర్పంచు మంజుల, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతూరి బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హనుమంతరావు కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నూతన సర్పంచులకు ఆయన పిలుపునిచ్చారు.
