జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండలం లోని శివ్వారం గ్రామ పంచాయతీ గురువారం రోజున కేసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ యువకులకు స్పోర్ట్స్ టీమ్ వారికి సామాగ్రిని అందజేసిన సర్పంచ్ ఆవిడపు గణేశ్, హాజరైన ఎంపీడీవో పి.సత్యనారాయణ, మాట్లాడుతూ యువతీ, యువకులు చదువుతోపాటు క్రీడల పై కూడా శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి గుర్తింపు పొందాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రామోజీ శ్వేత,మరియు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.