Sarpanch Odela Srilatha Bhaskar Consoles Bereaved Family
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన టాంపు కట్టయ్య అనారోగ్యం కారణంగా మరణించడంతో వారి పార్థివదేహానికి స్థానిక సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్ పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారితోపాటు ఉప సర్పంచ్ ముక్కెర రాజు,మాజీ ఎంపీటీసీ సతీష్,రఫీ, శరత్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
