“Sarpanch Fulfills Road Promise”
ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్న సర్పంచ్ హరిప్రసాద్
సర్పంచ్ హరి ప్రసాద్ పై నెక్కొండ ప్రజల ప్రశంసల జల్లు
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ ప్రజాభిమానాన్ని మరింతగా గెలుచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో బీసీ కాలనీలో రహదారి నిర్మాణం చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.
ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేసిన హరిప్రసాద్, స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో సీసీ రోడ్డు మంజూరు చేయించడంలో విజయవంతమయ్యారు. తాజాగా ఆ రహదారి పనులను పూర్తి చెయ్యడం జరిగింది దింతొ స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది.
బీసీ కాలనీలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్య పరిష్కారం కావడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచిపోకుండా అమలు చేయడం ద్వారా హరిప్రసాద్ నిజమైన ప్రజాప్రతినిధిగా నిలిచారని స్థానిక నేతలు చల్ల రగోతం రెడ్డి ,నేతుల సారంగపాణి యాదవ్, తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, పొట్లపల్లి వీరస్వామి గరికపాటి కృష్ణారావు, సింగం ప్రశాంత్, రామారపు రాము, అరువుపల్లి కేదారి, కక్కర్ల నాగయ్య గౌడ్, కక్కర్ల యాకయ్య గౌడ్, పసునూటి ప్రభాకర్, మహమ్మద్ సర్వర్, చొప్పరి శ్రీకాంత్, తాటి మామూల వెంకటేశ్వర్లు, తదితరులు కొనియాడారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు రగోతం రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న సర్పంచ్ హరిప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
