రేణుక ఎల్లమ్మ గుడికి గంటలు బహుకరించిన సర్పంచ్.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్ఆధ్వర్యంలో సర్పంచ్ తౌటం*, అంతయ్య, నాలుగవ వార్డు సభ్యుడు తౌటం నవీన్ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్లను ఘనంగా సన్మానించడం జరిగింది
అనంతరం గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచి ఉప సర్పంచ్లకు హర్థిక* శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని అదేవిధంగా మా రేణుక ఎల్లమ్మ గుడిలో గంటలు లేవు అనగానే స్పందించి వెంటనే మాకు గంటలు బహూకరించిన సర్పంచ్ తౌటం లక్ష్మి*అంతయ్య కి గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాలకవర్గం నుండి గౌడ సంఘానికి* *ఎల్లవేళలా సాయసాకారాలు ఉండాలని మనందరికీ రేణుక ఎల్లమ్మ దీవెనలు ఉండాలని ఆయన అన్నారు,ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గుర్రపు రాజు ప్రేరుమండ్ల రవీందర్ గాజర్ల మల్లేష్ కట్ట గానీ రామ్ చందర్ నవీన్ బుర్ర శ్రీనివాస్ బుర్ర కృష్ణ బుర్ర మొండయ్య శ్రీపతి సమ్మయ్య మండ దర్శనం బుర్ర రమేష్ గాజర్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
