గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో గణపురం సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట్రమణ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు చైర్మన్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో 10 సంవత్సరాల లో ఎంతో అభివృద్ధి చెందింది తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అన్నమాట తప్పకుండా పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ పథకాలలో కళ్యాణ లక్ష్మి ఒకటి ఆడబిడ్డలకు కట్నంగా ఇస్తున్నారు భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నీ వచ్చే ఎన్నికలలో అధిక మెజార్టీతోటి ఓట్లేసి గెలిపించాలని అదేవిధంగా ఎమ్మెల్యే ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని అన్నారు ఈ కార్యక్రమంలో గణపురం రెండో ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గణపురం టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి గౌడ్ ఏ ఆర్ ఐ దేవేందర్ మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు మాదాసు మొగిలి మోటం సింహాచలం తదితరులు పాల్గొన్నారు