Rajamallu Speeds Up Sarpanch Campaign
ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి గాజర్ల రాజమల్లు.
ఆశీర్వదించండి… అభివృద్ధి చేసి చూపిస్తా.
గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తా.
అర్షనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గాజర్ల రాజమల్లు
నల్లబెల్లి,నేటిధాత్రి:
వరంగల్ నల్లబెల్లి మండలంలో జరుగుతున్న అర్షనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గాజర్ల రాజమల్లు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఎన్నికల్లో సర్పంచ్ గా ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాజర్ల రాజమల్లు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఉన్న ఓటర్లను కలుస్తూ తనకు ఓటు వేస్తే గ్రామంలో ఉన్న అనేక సమస్యలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఓటర్ మహాశయులకు వాగ్దానం చేస్తూ వేడుకుంటున్నారు. గ్రామంలో నిస్వార్థంగా ఉండే రాజమల్లుకు ప్రజల నుండి పూర్తిస్థాయిలో మద్దతు రావడంతో ప్రత్యర్థులకు గుబులు పట్టింది.గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్ గా పోటీచేసి ఓడిపోవడంతో గ్రామంలో రాజమల్లుపై మరింత సానుభూతి వ్యక్తపరుస్తున్న ఓటర్లు తెలుపుతున్నారు.జిల్లా వ్యాప్తంగా పేరుగాంచిన అర్షనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల బొల్లోనిపల్లి గ్రామ బద్ది పోచమ్మతల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామంలో పేరుకుపోయిన అభివృద్ధి పనుల సమస్యలను పరిష్కరిస్తానని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు రాజమల్లు హామీ ఇచ్చారు.ఏది ఏమైనప్పటికీ చలి కాలంలో రాజకీయాలతో గ్రామాలు వేడెక్కుతున్నాయి.
