Sarpanch Bhogi Srilatha Distributes Christmas Gifts to Families
క్రిస్మస్ పండుగ కానుకలను అందజేసిన సర్పంచ్ భోగి శ్రీలత
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని సర్వాపురం గ్రామం లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న కుటుంబాలకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత క్రిస్మస్ పండగ కానుకగా చీరల పంపిణి, బెడ్ షీట్ల పంపిణీ చేయడం జరిగింది,అలాగే కౌకొండ గ్రామం లో సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మేకల చిరంజీవి ఆధ్వర్యంలో సర్వాపూర్ గ్రామ సర్పంచి భోగి శ్రీలత 40 కుటుంబాలకు క్రిస్మస్ పండుగ కానుకగా కుటుంబానికి ఒక బెడ్ షీట్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు భోగి మనోహర్ స్వామి,ఉప సర్పంచ్ దండు లక్ష్మయ్య, గ్రామ కమిటీ కార్యదర్శి దండు సాంబయ్య,వార్డు మెంబర్ భోగి రాధిక, సీనియర్ నాయకులు భోగి సుమన్,కుర్ల రాజేందర్,భోగి లక్ష్మయ్య,భాగ్యలక్ష్మి, రఘుపతి,ఆశ ఇనుగోల లలిత,శిరీష తదితరులు పాల్గొన్నారు.
