“Aarogyalakshmi Committee Meeting Held at Chityala”
ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం కేంద్రంలో ని నాలుగవ ,ఐదవ కేంద్రం అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, జ్యోతి ఏర్పాటు చేసిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశమునకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ హాజరైనారు. ముందుగా ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని జయప్రద సూపర్వైజర్ హాజరై కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట,పాట, కథ ద్వారా క్రమశిక్షణతో కూడిన ఎల్కేజీ, యూకేజీ నర్సరీ సంబంధించిన విద్యను బోధించి ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడం, రుచిగా, వేడిగా, క్వాలిటీ, క్వాంటిటీ ప్రకారం తల్లులకు, పిల్లలకు భోజనం పెట్టడం పిల్లల బరువులు తీయడం, లోప పోషణ గుర్తించడం బాలమృతం, ఎగ్స్ పంపిణీ చేయడం, కిశోర బాలికలకు, పల్లి పట్టీలు ఇవ్వడం, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, దత్తత, అనాధ బాలబాలికలను గుర్తించి హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని వివరించారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అప్పుడే పిల్లలందరూ అన్ని రంగాలలో ముందంజలో ఉంటారని వివరించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉన్న, అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపినారు. వారి చేతుల మీదుగా ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పల్లి పట్టీలు, బాలమృతం పంపిణీ చేయనైనది. వార్డు మెంబర్స్ తౌటమ్ నవీన్ మైదం శ్రావ్య ఏఎన్ఎం సుమలత , ఆశ వర్కర్ అధిక సంఖ్యలో మహిళలు కిశోర బాలికలు హాజరైనారు.
