
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కొందరు సర్పంచులు ఇప్పుడు పక్కదారి కడుతున్నట్లు రామడుగు మండలం లో జోరుగా చర్చ నడుస్తోంది. మండలంలోని కొక్కెర కుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభిషేక్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపి కార్యాలయంలో ఎంపి బండి సంజయ్ కుమార్ బిజేపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతనితో పాటు మరికొందరు సర్పంచ్ లు పదవీకాలం ముగుస్తున్నందున పార్టీలు మారుతారని మండలంలో జనాలు గుసగుసలాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సర్పంచ్ లకు ప్రభుత్వ నుంచి బిల్లులు రాక అప్పులు తీసుకువచ్చి మరి గ్రామాల్లో అభివృద్ధి చేసిన ఏత్రోవ కనిపించకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలవైపు చూస్తున్నట్లు మండలంలోని ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల్లో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున భవిషత్ కార్యాచరణ లక్ష్యంగా సర్పంచ్ లు పావులు కదుపుతున్నట్టు ప్రజలు ముచ్చటిస్తూన్నారు.