
Sardar Sarvai Papannagoud
బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్
తాండూరు,( మంచిర్యాల) నేటి ధాత్రి :
తాండూరు మండల కేంద్రంలోని మోకు దెబ్బ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను మంగళవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు.అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మోకు దెబ్బ నాయకులు మాట్లాడుతూ పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.మొఘల్ సామ్రాజ్యవాదాన్ని,సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కిరణ్ కుమార్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలోమోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి పెరుమాండ్ల భాస్కర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బురగడ్డ పుణ్ణం గౌడ్,చీకటి వెంకటేశం గౌడ్,చీకటి మొండి గౌడ్,చీకటి రవి గౌడ్,మడ్డి అరుణేశ్వర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి. ఈసా,జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి,మాజీ ఎంపీపీ సిరంగి శంకర్,బీఆరెస్ నాయకులు మాసాడి శ్రీరాములు,కాంగ్రెస్ నాయకులు చొప్పదండి నరేష్, మాజీ ఉప సర్పంచ్ చిర్ల రాజేశం,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.