నర్సంపేట , నేటిధాత్రి :
తొలి బహుజన వీరుడు శ్రీశ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 314 వ వర్ధంతి ఈ నెల 2 న
జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోకుదెబ్బ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని నియోజకవర్గ, మండల కేంద్రాలలో బహుజనులందరిని కలుపుకొని కార్యక్రమం నిర్వహించాలన్నారు.బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు పాపన్న అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలను ఏకం చేసేది ఒక్క గౌడ్ లే అని, మనల్ని ఐకమత్యంగా ఉండ కుండా చేసేది అగ్రకులాలే అని గౌడ కులస్థులను రాజ్యాధికారం వైపు రాకుండా వారు అణచివేస్తారని ఆరోపించారు. గౌడ్ లు ఐకమత్యంగా ఉంటే అగ్రకుల వర్గాలు బయపడతాయన్నారని ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం కోసం బహుజనులందరిని ఏకం చేసిన రోజే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు మనమిచే నిజమైన నివాళి అని రమేష్ గౌడ్ తెలిపారు.
# నర్సంపేట లో పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతి వేడుకలు..
నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ సెంటర్ లోని పాపన్న విగ్రహం వద్ద నేడు మంగళవారం ఉదయం 10 గంటలకు పాపన్న గౌడ్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌడ, గీత కార్మికులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్ట్ లు, మేడావులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, బహుజనులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని రమేష్ గౌడ్ తెలిపారు.