సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ భవన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ
తెలంగాణలో బహుజన వీరుడు, ప్రజానాయకుడు సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కృషి పేదల అండ దండగా ఉంటూ జమీందారులను సైతం మట్టి కల్పించిన మహావీరుడు మన సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్ చీటీ నర్సింగరావు, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం కళా చక్రపాణి, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, బి.ఆర్.ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కోడి అంతయ్య, కుంభాల మల్ రెడ్డి తదితర
బి.ఆర్.ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
