సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విగ్రహ దాత బయ్యా సోమన్న గౌడ్ మాట్లాడుతూ జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు, పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో పోరాడారు. 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించారు, ఒక సామాన్య వ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం అన్నారు,సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 – 1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించడు పాపన్న గౌడ్ భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు,పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేశాడు అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్న గౌడ్, గౌడ సంఘం మోకు దెబ్బ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు రేఖా శ్రీనివాస్ గౌడ్, పెద్ద గౌడ్ బోడపట్ల రవి గౌడ్, సారాకోలాగౌడ్ నరేష్ గౌడ్,విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు రేఖ ప్రవీణ్ కుమార్ గౌడ్, సోమగాని గణేష్ గౌడ్, బయ్యా గణేష్ తదితరులు పాల్గొన్నారు.