
Bhusaram Mondi Goud
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి
మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారం మొండి గౌడ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న జరిగే ఉత్సవానికి గౌడ బాంధవులు అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారం మొండిగౌడ్ అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో గీత కార్మికులకు లైసెన్స్ లేనందున,గీత కార్మికుల సమస్యలపై అలాగే మంచిర్యాల జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కొరకై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు.