ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 22
నాచారం డివిజన్ గవర్నమెంట్ వెస్లీ హైస్కూల్లో మరమ్మత్తులు చేయించిన దాచేపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు సుమారు 6 లక్షల వ్యయంతో స్కూలు మరమ్మత్తులు పనులు చేయించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది.
స్కూలు సందర్శించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి దాచేపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు ని అభినందించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేయాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో
నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ బి ఆర్ఎస్ ఎస్ సీనియర్ నాయకులు మేడల మల్లికార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ముత్యంరెడ్డి మల్లేష్ యాదవ్ నాచారం డివిజన్ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.