Saraswati School Student Selected for National Spelling Bee
స్పెల్లింగ్ బీ జాతీయస్థాయి పోటీలకు సరస్వతి విద్యార్థి
రామడుగు, నేటిధాత్రి:
జాతీయ స్థాయి స్పెల్లింగ్ బీ పోటీలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని ఉప్పు అన్విత ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన జోనల్ స్థాయి స్పెల్లింగ్ బీ పోటీల్లో అన్విత తృతీయస్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఈసందర్భంగా ఆయన సూచించారు. అనంతరం జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అన్వితను విశ్వం ఎడ్యుటెక్ జోనల్ హెడ్ వినాయక్, ఇంటర్నేషనల్ మెమొరీ ట్రైనర్ దైవాల వేణుకుమార్, స్కూల్ కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.
