తంగళ్ళపల్లి మండల నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ గ్రామ కాలనీలో గత కొన్ని రోజులుగావిధి దీపాలు వెలగడం లేదని అధికారుల చిన్నచూపు తో గ్రామం అంధకారంలో ఉందని కార్మిక నిలయం అయినటువంటి ఇందిరమ్మ కాలనీలో టెక్స్టైల్ పార్క్ కాలనీలో కొద్దిరోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో గ్రామంలో చిమ్మ చీకటి నెలకొందని ఇప్పుడు చలికాలం కావడంతో తొందరగా చీకటి పడుతుందని చీకట్లో ప్రజలు బయటకు వెళ్ళాలేక ఇబ్బందులు పడుతున్నారని పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే మహిళలకు వృద్ధులకు చీకట్లో ప్రమాద బారిన పడుతున్నారని కాలనీలో చీకటి పడటంతో విషపూరిత పాములు పిచ్చి కుక్కలు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అందువల్ల ప్రజలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే స్ట్రీట్ లైట్ వెలిగించేల సమస్యలు పరిష్కరించాలని. రైజింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కారోబార్ రాజా మహేందర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వీటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమే దిశగా చూస్తానని తెలియజేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో రైజింగ్ స్టార్ యూత్.లుఅధ్యక్షులు
శ్రీరాములురాము రమేష్ చంద్ర ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు