డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ ఆవరణలో శనివారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు నాటడం జరిగింది, పచ్చని చెట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెట్టును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని గ్రామంలోని ప్రజలందరూ ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున పెంచాలని అందరు మొక్కలు నాటినప్పుడే రాష్ట్రం పచ్చదనంగా ఉంటుందని కాలుష్య బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు, అనంతరం బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు, అలాగే మొక్కలు నాటడమే కాదని వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, రాయకమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ,కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అలకొండ కుమారు, మరియు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు అల్లం రాజు గంగాధర్ రవి, బ్యాంక్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.