*సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భారత దేశం…
*ప్రకృతిని ఆరాధించే పండుగే సంక్రాంతి…
*ఆచార వ్యవహారాలను ఆరాధించే గొప్ప సియం చంద్రబాబు నాయుడు…
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…
*తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు
చిత్తూరు (నేటిధాత్రి:
సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం ప్రతీక అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనమన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకుంటూ.. “సంక్రాంతి” పండుగ వైశిష్ట్యాన్ని భావితరాలకు తెలియజేస్తున్న
స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఏ.పి. సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు,
తెలుగు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ మూడు రోజుల సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సంక్రాంతి అందరిలోనూ నూతన వెలుగులు తీసుకొస్తుందనీ ఆయన కాంక్షించారు.
మానవునిలో నూతన ఉత్తేజాన్ని నింపేవి పండుగలన్నారు.ఆధ్యాత్మికంగాను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని ఈ పండులు ప్రతిబింబిస్తాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.
