“ఇండేన్” లో సంక్రాంతి సంబరాలు.

“ఇండేన్” ఇస్తుంది సురక్షితమైన వంట..సంక్రాంతి ఇస్తుంది బహుమతుల పంట.

తెలంగాణలో “పీ.వి. మదన్ మోహన్” సూచించిన క్యాప్షన్ ఎంపిక.

కస్టమర్లకు “లక్కీ డ్రా” ద్వారా “వెండి కాయిన్స్” బహుమతి

“నేటిధాత్రి”,హుజూరాబాద్
ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ ఇండేన్ కస్టమర్లను ప్రోత్సహించడం కోసం తలపెట్టిన 25 గ్రాముల సిల్వర్ కాయిన్ డ్రా కార్యక్రమాన్ని ఐఓసియల్ కేంద్ర కార్యలయంలో ఐఓసియల్ టాప్సో
(తెలంగాణా ఆంధ్ర)జియం యోగా రాణి సురేశ్ డీలర్ల సమక్షంలో ఈ ఉదయం కన్నులపండువగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్
కార్పోరేషన్ తమ ఆధీక్రుత ఇండేన్ డీలర్ల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లను ప్రోత్సహించేందుకు 25గ్రాముల వెండి నాణెం అందించే సంకల్పంతో దీపావళి,క్రిస్మస్,సంక్రాంతి సందర్భంగా బంపర్ డ్రా నిర్వహించి ఎంపికైన వారికి వెండి నాణెం అందించే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్ఛినట్లు తెలిపారు.సోమవారంనాడు సనత్ నగర్ ఇండియన్ ఆయిల్ భవన్ లో సంక్రాంతి సంధర్భంగా చివరి డ్రా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు‌.ఆయిల్ కంపనీలు తాము ఆమోదించిన వెండర్ల ద్వార గ్యాస్ డీలర్లకు ఉపకరణాలు అందిస్తున్నామని‌ వివరించారు..నాణ్యత కాలపరిమితి ఎక్కువగా వుండే అవకాశాలు వుంటయాని కాబట్టి కంపనీ ఆమోదించిన స్టౌ,రబ్బరు ట్యూబ్, ఇతర ఉపకరణాలు వాడాలని కోరారు‌
తెలంగాణ వ్యాప్తంగా రెండువందల ఇండేన్ డీలర్ల జూమ్ పద్దతిన డ్రా నిర్వహించి ఎంపికైన వారికి 25గ్రాముల వెండి నాణెలను సంక్రాంతి కానుకగా అందించినట్లు ఆమె తెలిపారు.


ఐఓసియల్ సికింద్రాబాద్ డివిజనల్ హెడ్ సీతేష్ కిషన్ మాట్లాడుతూ “ఇండేన్ ఇస్తుంది సురక్షితమైన వంట” ఈ సంక్రాంతి ఇస్తుంది బహుమతుల పంట” అనే నినాదంపై నిర్వహించిన సంక్రాంతి బంపర్ డ్రాకు మంచి స్పందన వచ్చిందని చాలామంది ఐఓసియల్ గుర్తించిన వంటగ్యాస్ ఉపకరణాలు కొనేందుకు ఆసక్తిని చూపారని తెలిపారు.
ఎల్లప్పుడూ హెటిఈ హై థర్మల్ ఎఫీషియన్సీ స్టౌ,సురక్ష రబ్బరు ట్యూబులు వాడాలని‌ కోరారు.
ఐఓసియల్ సికింద్రాబాద్ డివిజన్ సికింద్రాబాద్ ముఖ్య అధికారి సుబ్బారావు మాట్లాడుతూ‌ బేసిక్ సేప్టీ చెక్స్ (ప్రాథమిక భద్రతా ) కార్యక్రమాలను గ్యాస్ డీలర్లు తమ డెలివరీ బాయ్స్ ద్వారా నిర్వహించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి క్రుషిచేయడం‌ పట్ల అభినందనలు తెలిపారు.ఇంకా చాలామంది మన్డేటరీ డ్యూ కాలపరిమితి దాటిన సురక్ష రబ్బరు ట్యూబ్ వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా వుందని వాటిని మార్చాలని కోరారు.
*హుజూరాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీలో జరిగిన డ్రా కార్యక్రమంలో కరీంనగర్ సేల్స్ ఏరియా మేనేజర మిట్ట మహేష్ పాల్గొన్నారు… జూమ్ ద్వారా నిర్వహించిన ఈ డ్రా ద్వారా ఈ ఏరియాలో ఇరవై ఐదు మంది కస్టమర్లను ఎంపిక చేశామని మహేశ్ తెలిపారు.


అదేవిధంగా ఏజన్సీ అధినేత పి.వి.మదన్ మోహన్ సూచించిన “ఇండేన్ ఇస్తుంది సురక్షితమైన వంట”
“సంక్రాంతి ఇస్తుంది బహుమతుల పంట” క్యాప్షన్ తెలంగాణ వ్యాప్తంగా ఎంపికవాడం పట్ల అభినందనలు తెలిపారు.
వంటింటి ప్రమాదాలు జరుగకుండా ప్రతి కస్టమర్ గ్యాస్ బాల్ కలిగి వుండాలని‌ దాని ధర అత్యల్పంగా వుంటుందని‌ ఆయన సూచించారు..
ప్రభుత్వం ద్వారా వెసులుబాట్లు పొందేందుకు వీలుగా ఈకేవైసి విధిగా చేసుకోవడానికి చొరవ చూపాలని కోరారు.
ఈ‌ కార్యక్రమంలో సీనియర్ అధికారులు కీర్తి, దిలీప్ నాయక్, శాంతి స్వరూప్, నబిలా రహమ్మాన్ ,అంకూర్ ,సీనియర్ డీలర్లు పి.వి.మదన్ మోహన్,సుభాష్ రావు,ఉప్పల్ రమేశ్,అయిలారెడ్డి,వామన్ రావు, దేవేందర్ రెడ్డి,రాజ్ మోహన్ ,రాం రెడ్డి,రాధక్రిష్ష,వెంగళరావు,కోహెడ రవీందర్,సత్యనారాయణ, వీరన్న, శ్రీచరణ్ ,వెంకటేశ్వర రావు, ప్రవీణ్,భాస్కర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!