Pre-Sankranti Celebrations at Sri Chaitanya School
శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తూ సంక్రాంతి సంబరాలు
రైతు దంపతులకు ఘన సన్మానం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 01లో ముందస్తూ సంక్రాంతి సంబరాలు స్కూలు యాజమాన్యం ఘనంగా చేపట్టారు.గ్రామీణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించేలా శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏజీఎం అరవింద రెడ్డి విద్యార్థులకు మన పండుగల విశిష్టతను,రైతు ప్రాముఖ్యతను తెలిపాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు ఏర్పాటు చేయడం అబినందనీయమని తెలిపారు.సంక్రాంతి పండుగ మన సంస్కృతిలో అందర్భగమని,పంట చేతికొచ్చిన వేళ రైతు జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు.విద్యార్థులు కోలాహాలంతో స్కూల్ ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.సమాజానికి వెన్నెముకైన రైతు దంపతులను గౌరవించుకోవడం పండగ వేడుకల్లో విశేషంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్,హైస్కూల్ కో–ఆర్డినేటర్ నాగరాజు,ప్రైమరీ కో–ఆర్డినేటర్స్ జయశ్రీ,రోజా, ప్రైమరీ ప్రిన్సిపల్ స్రవంతి,ఎఓ విలాస్,ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
