ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంబరాలు జరుపుకోవడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శుభోదయ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగిందని సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించడం మూలంగా పండుగ జరుపుకోవడం జరుగుతుందని దక్షిణాది నుంచి ఉత్తరాయణం సూర్యుడు ప్రవేశించడం మూలంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భోగి మంటలు కాల్చడం జరుగుతుందని పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త ఆలోచనలకు నూతన ఆలోచనలు స్వీకరించాలని చెప్పే పండుగ అని ఇంటి ముందు ముగ్గులు వేయడం జరుగుతుందని ముగ్గుల యొక్క ప్రత్యేకత బయట ఇంటి ముందు పిండి ముగ్గులు వేయడంతో మధ్యలో ఆవుపేడతో చేసినటువంటి రేగి పండ్లను నవధాన్యాలను ఇంటి ముందు కడప పైన ఉంచడం జరుగుతుందని ఇంటి లోపలికి క్రిమి కీటకాలురాకుండా సంరక్షణ చేయడం జరుగుతుందని హరిహరదాసుల గంగిరెద్దుల వాళ్లు రైతు దగ్గరికి వచ్చి దానం చేయడం అని అడగడం జరుగుతుందని రైతులు పండించిన దాన్యమంతా ఇంటి లోపల ఉంటుంది సంక్రాంతి రోజున పిండి ధాన్యాలతో చేసినటువంటి గారెలు సకినాలు కారపూసలాంటివి చేయడం జరుగుతుందని శరీర ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా ఈ వంటలు చేసుకోవడం జరుగుతుందని అదే రోజు మాంసాహార o కుటుంబ సభ్యులతో భుజించడం జరుగుతుందని మూడవరోజు కుసుమ ఆరోజు పశువులకు నూనెతో స్నానం చేయించి వాటిని కడిగి వాటి కొమ్ములకు నూనెతో రాసి వాటి కడుపులోకి నూనెను తాగించడం జరుగుతుందని కుసుమ రోజున పశువులను మంచిగా చూసుకుంటూ కుసుమ ప్రత్యేకథను చాటుకుంటారని అలాగే ఈరోజు శుభోదయం పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అందులో ఏం డోంట్ బీ అడి కేత్డ్. అనే అంశానికి మొదటి బహుమతి ఇవ్వడం జరిగిందని రెండో బహుమతి జార్జ్ లేక్ గ్రూప్ కి బహుమతులు ప్రధానం చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ ప్రిన్సిపల్ మాధవి లతా రెడ్డి ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ సరిత కవిత కీర్తన వాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!