పి ఆర్ టి యు ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంకా బద్రి నారాయణ నియామకం
మహబూబాబాద్/ నేటి ధాత్రి
పి ఆర్ టి యు టి ఎస్ ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పి ఆర్ టి యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు భూక్యా రామోజీ నాయక్ మరియు మండల ప్రధాన కార్యదర్శి కాపర బోయిన సుజాత మరియు జిల్లా రాష్ట్ర బాధ్యులు. మరియు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.