అనారోగ్యానికి గురైన వృద్ధురాలికి సంజీవని అందజేత
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
కేంద్ర హోం శాఖా మంత్రి బండి సంజయ్ ఎల్లారెడ్డిపేట మండలంలో వృద్ధురాలికి సంజీవని అందజేసి ఔదార్యాన్ని చాటాడు. వివరాల్లోకెళితే ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల రమేష్ తల్లి వజ్రమ్మ కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉండడంతో ఇబ్బంది పడుతున్న వారి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సంజీవని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి గణేష్, పిట్ల శ్రీశైలం, నంది నరేష్, కిరణ్ నాయక్, చేవూరి మధు, శాగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.