లారీ ప్రమాదంలో గాయపడిన కుటుంబానికి అండగా బండి ఆర్థిక సహాయం
జమ్మికుంట: నేటిధాత్రి
ఆపదలో ఉన్న వారిని ఆదుకొనిమానవత్వం చాటుకున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీకొనడంతో లారీ కింద దివ్యశ్రీ అనే మహిళ ఇరుక్కుంది. ఈ విషయాన్ని గమనించినస్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ లారీని ఆపివేశాడు. ప్రమాదంలో గాయపడిన మహిళ మానకొండూర్ మండలం గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ఇదే సమయంలోములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ఘటన స్థలంలో ఆగి దివ్యశ్రీని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు.
లారీ కింద టైర్ పక్కన రాడులో మహిళ జుట్టు చిక్కుకొని ఉండడంతో ఆ మహిళ భయభ్రాంతులకు లోను కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా భయపడొద్దు ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. అటుగా వెళుతున్న లారీలను ఆపి జాకీ సహాయంతో టైర్లు పైకి లేపి లారీలో ఇరుక్కున్న మహిళ జుట్టును తీసివేసి క్షేమంగా మహిళను బయటకు తీశారు.గాయాల పాలైన మహిళను కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు తరలించారు.ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు తెలిపిన సంజయ్ తెలిపారు.