గ్రామాల ఆరోగ్య బాధ్యతలు పంచాయతీ కార్యదర్శిలదే
పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాలలో పిచ్చి మొక్కలు పెరిగి చేత్త చెదారం పేరుకు పోయినందున పంచాయతీ కార్యదర్శులు తమ విధులకు సరైన సమయానికి హాజరై ప్రతి రోజూ తమ గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పారిశుధ్యం పనులు చేయించాలని,గ్రామాలలో లోతట్టు ప్రాంతాలలోమరియు మురికి కాలువల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఏదైనా గ్రామంనుండి పారిశుద్ధ పనులు సరిగా నిర్వర్తించడం లేదని దరఖాస్తు వస్తే ఆ గ్రామపంచాయతీ సిబ్బంది పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈనెల 12న ఎమ్మెల్యే సమీక్షా సమావేశం ఎజండా ప్రకారం పంచాయతీ ప్రత్యేక అధికారులతో చర్చించి పూర్తి వివరాలతో హజరు కావాలని సూచించారు.