మండల కేంద్రంలో పడకేసిన పారిశుద్ధ్యం..?
పంచాయత్ ఆఫీస్ లోనే చెత్తచెదారం… మరి గ్రామంలో పరిస్థితి అంతకన్నా అధ్వానం.
గ్రామంలో ప్రతి వీధిలో డ్రైనేజ్ తో నిండిన కాలువలు.
సైడ్ కాలువ కనపడకుండా కమ్మేసిన చెట్లు. రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీరు..!
నిద్ర అవస్థలో గ్రామపంచాయతీ అధికారి..!
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది అలసత్వంతో వీధులలో నిండిపోయిన డ్రైనేజీ దోమలు ఈగలు విజృంభిస్తున్న పట్టించుకోని అధికారి, వివరాల్లోకి వెళితే చిట్యాల మండల కేంద్రం పెద్ద గ్రామపంచాయతీ మెయిన్ రోడ్డు వెంబడి ఒకే వైపు సైడ్ కాలువ ఉంది ఆ కాలువలో చెత్త చెదారంతో నిండి దోమలు ఈగలు విజృంభిస్తున్న పట్టించుకోని గ్రామ అధికారి, కనీసం వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చేసిన దాఖలాలు లేవు, సాయంత్రమైందంటే గ్రామంలోని ప్రజలు దోమలతో ఈగలతో బాధపడుతూ జ్వరాలు బారిన పడుతున్నారు, ఇంత జరిగినా పంచాయతీ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు,
అలాగే పశువైద్యశాల వెంబడి ఉన్న వీధిలో డ్రైనేజి మొత్తం నిండిపోయి ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి, రాత్రి అయిందంటే దోమలతో బాధపడుతూ డెంగీ జ్వరం వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు, కానీ ఇంతవరకు అధికారి ఆ డ్రైనేజీ వైపు చూసిన పాపాన పోలేదు అలాగే చిట్యాల గ్రామపంచాయతీ ముందు గల సైడ్ కాలువలో చెత్తచెదారంతో నిండి ఉన్న కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, ఇంత జరిగినా కూడా గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో ప్రజలు కోపద్రకులవుతున్నారు, చిట్యాల కొత్త బస్టాండ్ నుండి ఎఫ్ సి ఐ గోదామువరకు కనీసం సైడ్ కాలువ కనిపించకుండా చెట్లు పెరిగిన కూడా కొన్ని సంవత్సరాల నుండి పట్టించుకోని
గ్రామపంచాయతీ అధికారి తూతూ మంత్రంగా పనులు ముగించుకొని వెళ్తూన్నారు, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వాడల్లో చెత్తాచెదారంతో డ్రైనేజీతో దోమలతో ఈగలతో నిండిపోతున్న పట్టించుకోని అధికారిపై మండల ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మండల అధికారులు స్పందించి వర్షాకాలం సీజన్ కావున వీధులలో దోమల మందు పిచికారి చేసి కాలువల శుభ్రం చేయించి బ్లీచింగ్ చేయాలని వేడుకుంటున్నారు, లేనియెడల రోగాల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని వీధులలో ప్రజలు విరోచనాలు వాంతులతో
హాస్పటల్లో చేరి బాధపడుతున్నారు కనీసం వారంలో రెండు రోజులైనా క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు, అసలే పంచాయితీకి సర్పంచ్ లేని కారణంగా పనులను పట్టించుకోకుండా పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కావున మండల కేంద్రంలోని వీధులలో చెత్తచెదారంతో నిండకుండా డ్రైనేజీలను శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.