అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల
◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు,
◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు
చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.