రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి:
భారత యాదవ సమితి (బి వై ఎస్) రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లాలోని మండల, గ్రామ కమిటీలు నిర్మాణం చేసి జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సంగ రవి అన్నారు. ఈ సందర్భంగా సంగ రవి మాట్లాడుతూ…. బి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్, జిల్లా అధ్యక్షులు గొర్రె తిరుపతి, గౌరవాధ్యక్షులు గంగన్న యాదవ్, జిల్లా సలహాదారు గెల్లు రవీందర్ యాదవ్ ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీల నియామకం ఏర్పరచుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నేపథ్యంలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.