మేడారం సమ్మక్క సారలమ్మలకు చందన సుగంధ మాలలు, పట్టు వస్త్రాలు

అమ్మలకు అరుదైన గౌరవ కానుక…

మంత్రి సీతక్క చేతుల మీదగా వనదేవతలకు బహుకరణ…

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి …

మంగపేట నేటిధాత్రి

తెలంగాణ కుంభ మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ లకు కేరళ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు మరియు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదగా బహుకరించనున్నట్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి తెలిపారు గురువారం ఉదయం ఆయన తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను కుటుంబ సమేతంగా దర్శించుకుని ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు నిలువెత్తు తులాభారం బంగారం (బెల్లం) మరియూ అమ్మలకు నూతన వస్త్రాలను సమర్పించారు ఆలయ సిబ్బంది అమ్మల దర్శనం జరిపించిన అనంతరం ప్రసాదాలను సాంబశివరెడ్డి దంపతులకు అందజేశారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈరోజు అమ్మలను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ ఒరిస్సా సహా ప్రపంచ నలుమూలల నుండి కోటి మందికి పైగా భక్తులు వస్తారని ఆయన అన్నారు ఇంతటి విశిష్టత ఉన్న మేడారం వన దేవతలకు కేరళ రాష్ట్రం నుండి సుగంధ హస్త కళాకారులతో ప్రత్యేకంగా రూపొందించిన సుగంధ హారాలు, చందన మాలలు మరియు పట్టు వస్త్రాలను జాతర సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదగా అమ్మలకు బహుకరించనున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు ఇది సమ్మక్క సారలమ్మ లకు లభించిన అరుదైన గౌరవ కానుకగా తాను భావిస్తున్నట్లు, అమ్మలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబ శివ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే మేడారం జాతరకు వచ్చి అమ్మలను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని సాంబశివరెడ్డి అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క చొరవతో మేడారం లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపళ్లి తిరుపతిరావు కార్యాలయ సిబ్బంది జడ్డి పూర్ణ ప్రసాద్ పసుపులేటి కార్తీక్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *