మంజూరైన పనులను తక్షణమే మొదలు పెట్టాలి.

# అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు.
# గ్రామాల అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పనులు తెచ్చారు.
# జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్
# రోడ్డుపై నిరసన దీక్షా చేపట్టిన బి ఆర్ ఎస్ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి :

దుగ్గొండి మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృధ్ధి చెందాలని ఉద్దేశ్యంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక రకాల నిధులను మంజూరు చేయించారని ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుండి అన్ని కేంద్రాలను రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు గాను బిటి రోడ్లను మాజూరి ఐనా పనులు వెంటనే మొదలుపెట్టాలని జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ప్రభుత్వానికి కోరారు.గత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దేశాయపల్లే నుండి లక్ష్మి పురం నుండి 3 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్డు మంజూరి కాగా పనులకు బ్రేక్ పడింది.దీంతో ఆ రోడ్డు పనులు వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి దుగ్గొండి మండల కమిటీ అధ్వర్యంలో మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్ రావు అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు.ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది మండల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు నిర్వీర్యం అవుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.గత ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసిన పనులకు టెండర్లు,అగ్రిమెంట్ లు పూర్తయ్యాయని వాటిని నేను పూర్తి చేస్తే ఎలా అని ఉద్దేశ్యంతో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే పనులను నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.ఇప్పటి దుగ్గొండి మండలంలో పంటలు ఎండిపోయాయని పేర్కొంటూ 10 సంవత్సరాలుగా సాగునీళ్ళ పట్ల మరిచిపోయిన రైతులు నేడు అదే సాగు నీటి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. డిబీఎం 38 మెయిన్ కెనాల్ నుండి కంటిన్యూగా నీళ్ళు వచ్చిన దాఖలు లేవని వివరించారు.గత ప్రభుత్వం 78 కోట్ల రూపాయల నిధులతో వ్యవసాయ పనిముట్లను తేగా అవి ఇంకా పూర్తి స్థాయిలో మనుగడలోకి రాలేదని గత ప్రభుత్వం పార్టీలకతీతంగా రైతులకు అందించారని పేర్కొన్నారు.ఇప్పటికైనా మండలంలోని మంజూరైన అన్ని పనులను నాణ్యత పరిమాణాలలో పూర్తి చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి,ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య,ఎంపిటిసి మామునూరి సుమన్,గుండెకారి రంగారావు,కందకొండ రవీందర్,కృష్ణ,కామిషెట్టి ప్రశాంత్, బి ఆర్ ఎస్ యూత్ నాయకుడు తిరుపతి యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *