నిర్లక్షంకు నిలువుటద్ధం “సంరక్ష” హాస్పిటల్

“రక్షణ” లేని “సంరక్ష” ?

హాస్పిటల్ నిర్లక్ష్యం? హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగిన పేషెంట్ బంధువులు

ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూలు, రోజూ మినిమం ఒక లక్ష, లేదంటే 50వేలు కట్టాల్సిందే అని బాధితుల ఆవేదన

పేరుకే “ఉత్త”మ సేవ హాస్పిటల్ అవార్డ్, అయితే పైసలుండాలి లేదా ఇన్సూరెన్స్ ఉండాలి అంటున్న జనాలు

పది రోజులు ట్రీట్మెంట్ తరువాత సీరియస్ అంటూ హైదరాబాద్ వెళ్ళాలని అన్న యాజమాన్యం

హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు

పోలీసుల జోక్యంతో బాధిత మహిళకు న్యాయం

ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్ తరలించిన బంధువులు

“నటరాజ శ్రీ స్వామి” నీకిది న్యాయమా అంటున్న వరంగల్ తూర్పు బాధితులు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ తూర్పు పరిధిలో, వెంకట్రామా జంక్షన్ వద్ద గల సంరక్ష హాస్పిటల్ నందు, ఈనెల 11న వరంగల్ చార్బౌలి ప్రాంతానికి చెందిన వాణి అనే మహిళ మూత్రపిండాల సమస్యతో ఆసుపత్రిలో చేరగా తనకున్న హెల్త్ కార్డు ద్వారా ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి, దాదాపు 13 రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తూ, హెల్త్ కార్డు ఉన్నందువలన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కేవలం మెడికల్ షాప్ వరకు బిల్లులు చెల్లిస్తే చాలు అని హాస్పిటల్ వర్గాలు చెప్పినట్లు రోగి బంధువులు తెలుపుతున్నారు. మూత్రపిండాల సమస్యతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, నేడు పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంది అని, హైదరాబాదుకు వెళ్ళండి అంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా తెలుపగా హాస్పిటల్లోనే ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు. తన భార్య పరిస్థితి ఆవేదన చూసి భర్తకు హాస్పిటల్లోనే స్ట్రోక్ వచ్చినట్లు బంధువులు తెలిపారు. వెంటనే అదే హాస్పిటల్లో అతనికి స్టంట్ వేశారు సదరు డాక్టర్లు మూడు లక్షల రూపాయలు స్టంట్ వేసినందుకు బిల్ అయినట్లు తెలుస్తోంది. ఒకే హాస్పిటల్లో అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరు అడ్మిట్ అయి ఉండటం వల్ల దుంఖం, ఆందోళనతో ఉన్న కుటుంబ సభ్యులకు తమ తల్లి ఆరోగ్యం బాలేదు హైదరాబాద్ తీసుకెళ్లండి అని డాక్టర్లు చెప్పడంతో వారికి అనుమానం వచ్చి ఏమి ట్రీట్మెంట్ చేశారు ఇన్ని రోజులు? ఇప్పుడెందుకు హైదరాబాద్ అంటున్నారు అని గట్టిగా నిలదీశారు. మెడికల్ షాపు బిల్లు మూడు లక్షల రూపాయలు వరకు కడితే చాలు మిగతాది మేము ఇన్సూరెన్స్ కార్డు ద్వారా క్లెయిమ్ చేసుకుంటాం అని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వెంటనే బంధువులు మిత్రులు హాస్పిటల్ కి చేరుకొని ఆందోళన చేశారు. గడచిన 13 రోజుల నుంచి ఏ ట్రీట్మెంట్ చేశారు ఏమో తెలియదు కానీ, రోగి పరిస్థితి అత్యంత ప్రమాదంలోకి వెళ్లడం గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆసుపత్రి డాక్టర్లను యజమాన్యంను నిలదీయగా వారు ఉస్మానియా ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను సైతం పిలిపించి వైద్యం చేయించాం అని తెలిపిన డాక్టర్లు. అయినా కానీ పేషెంట్ కండీషన్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో, ఆసుపత్రి వర్గాలు అప్పటికే హెల్త్ కార్డు ద్వారా బిల్లులు దాదాపు 20 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మెడికల్ షాప్ లో మాత్రం మూడు లక్షల బిల్ అయింది అదొక్కటి కడితే సరిపోతుంది. ఆ బిల్లు కట్టి పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్లండి అని వైద్యులు చెప్పగానే, పేషెంట్ తరపున బంధువులు అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఆసుపత్రిలో అని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యజమాన్యంను నిలదీయగా మా చేతిలో ఏమీ లేదు, మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కేవలం మెడికల్ షాప్ బిల్లులు మూడు లక్షల రూపాయలు చెల్లించి హైదరాబాద్ తీసుకెళ్లండి అని మరో మారు చెప్పడంతో పేషంట్ బంధువులు ఆందోళన ఉదృతం చేయగా, వెంటనే స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ రంగప్రవేశం చేసి దాదాపు గంటన్నర అటు బంధువులతో, ఇటు డాక్టర్లతో చర్చించి, జరిగిన సంఘటనపై వివరాలు ఆరా తీసి, జరిగిన తప్పిదాన్ని వైద్యుల నిర్లక్ష్య నిర్లక్ష్యమే కారణమని తెలుసుకొని, వెంటనే వైద్యులను మందలించి పేషంటుకు తగిన న్యాయం చేశారు. పేషెంట్ కి కావాలసిన ట్రీట్మెంట్ మొత్తం ఖర్చులు ఇన్సూరెన్స్ బాధ్యత హాస్పిటల్ యాజమాన్యమే బరించాలి అని పేపర్ రాపించి, పేషెంట్ ను హైదరాబాద్ కు తరలించారు. వెంటనే స్పందించి న్యాయం చేసిన మిల్స్ కాలనీ పోలీస్ సీఐ కి పేషెంట్ బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

మిల్స్ కాలనీ పోలీసుల చొరవ అభినందనీయం

సంరక్ష ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన మిల్స్ కాలనీ పోలీసు అధికారి, సదరు ఆసుపత్రికి చేరుకుని దాదాపు రెండు గంటలు కూర్చొని విచారణ జరిపి, హాస్పిటల్ నిర్లక్ష్యం పైన సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడి, మందలించి, బాధిత మహిళకు న్య్యాయం చేసిన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ కి పేషెంట్ బంధువులు మిత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పేరుకు “ఉత్త”మ సేవ హాస్పిటల్ అవార్డు

సోషల్ మీడియాలో ఒక ఎస్ఎంఎస్ వైరల్ అవుతుంది.
సదరు హాస్పిటల్ కు ఉత్తమ సేవ అవార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ 2024,15వ ఆగస్టుకి కూడా మళ్ళీ ఇవ్వండి “ఉత్త”మ సేవ అని, నిర్లక్ష్యపు డాక్టర్లు, 40మంది బడా డాక్టర్లు కలిసి, తలో 10లక్షలు వేసి 4కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టడం. ఈఎచ్ఎస్, ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ పేరుతో అక్రమ బిల్లులు. అన్ని ట్రీట్మెంట్ లు చేయడం, ఆగం చేయడం, బిల్లుల ఆమోదం కోసం రాజకీయ నాయకుల మద్దతు ఉండటం. ఒక్కో డాక్టర్ కి నాలుగేసి హాస్పిటల్ లో పార్టనర్షిప్ ఉండటం. వీళ్లకు ఉత్తమ సేవ అని అవార్డ్ ఇచ్చే బదులు, పేదలకు 20 రూపాయలకే వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అవార్డ్స్ అంటున్నారు కొందరు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!